రామోజీ రావుపై తమ్మారెడ్డి ‘బూతు’ కామెంట్స్

139
Thamma Reddy against Ramoji Rao

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు గురించి చెప్పనవసరం లేదు..విలువలను కాపాడుకునే వ్యక్తి అని గొప్పగా చెపుతుంటారు. అలంటి ఆ వ్యక్తి ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు తమ్మారెడ్డి భరద్వాజ. రామోజీ గారు నాకో స్ఫూర్తి. కష్టపడి పని చేసి.. ఆయన ఏకంగా ఒక సామ్రాజ్యం సృష్టించారు. న్యూస్ పేపర్ పెట్టి.. ఛానళ్లు పెట్టి.. చాలా కష్టపడి విలువల్ని పాటిస్తూ.. ప్రజలంతా నమ్మేలా.. ఆదర్శంలా.. ఫోర్త్ ఎస్టేట్ అంటే అసలైన ఫోర్త్ ఎస్టేట్ లా మీడియా స్థాపించారు.

Thamma Reddy against Ramoji Rao

ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా విలువలతో కూడిన కార్యక్రమాలు రూపొందించటం.. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా ఛానల్ లో ప్రసారం చేస్తారన్న పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈటీవీ చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఏ ఛానల్ లో ఉండనంత దారుణంగా డబుల్ మీనింగ్ డైలాగులతో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారని అన్నారు. అసలు రామోజీ రావు గారు ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్నారో లేదో తెలియదు గానీ ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఛానల్స్‌లో రాదగినవి కాదు అని చెప్పుకొచ్చారు.

రామోజీ రావు రాత్రి 9వరకు మాత్రమే ఛానల్‌ చూస్తారని ఆ తర్వాత చూడరని ఒక మిత్రుడు తనతో చెప్పారన్నారు. కానీ పెద్దాయన చూసినా చూడకపోయినా… అలాంటి కార్యక్రమాలను ఎలా ప్రసారం చేస్తారని నిలదీశారు.డబ్బు కోసం, రేటింగ్‌ కోసం చాలా చేయొచ్చు కానీ.. రామోజీరావు అలా చేయకూడదన్నారు. జీటీవీ, మాటీవీ, జెమిని టీవీల్లో ఏ కార్యక్రమైనా బాగోలేకపోతే నేరుగా యజమాన్యానికి ఫోన్ చేసేవాడినన్నారు. కానీ రామోజీరావుకు ఫోన్ చేస్తే ఎత్తుతారోలేదో తెలియదని అందుకే ఇలా పబ్లిక్‌గా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా డబుల్‌ మీనింగ్ కార్యక్రమాలను కొంచెం కంట్రోల్ చేస్తే మంచిదన్నారు. తమ్మారెడ్డి ఆవేదన రామోజీరావుకు చేరి… డబుల్ మీనింగ్ కార్యక్రమాలకు చరమగీతం ఉంటుందో లేదో!.