సీఎం సహాయనిధికి రామోజీరావు రూ. 5 కోట్ల విరాళం..

54
Ramoji Rao

కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. వరద బాధితులను ఆదుకోవడానికి ఎంతో ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల కుటుంబాలను సహాయార్థం తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధి ఈ చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా రామోజీరావుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సినీ దర్శకుడు ఎన్.శంకర్ కూడా వరద బాధితుల సహాయార్థం తన వంతుగా రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్ ను స్వయంగా కేటీఆర్ కు ఆయన అందించారు.