కవితను కలిసిన ఆస్ట్రేలియా బృందం

167
Australia delegation meets MP Kavitha

భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య మైత్రి కై అస్ట్రేలియా ప్రధాన మంత్రితో విచ్ఛేసిన ప్రతినిధి బృందం ఢిల్లీలో జాగృతి అధ్యక్షురాలు , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితని కలిశారు. ఆస్ట్రేలియా లో ఉన్నత విద్య కై వచ్ఛే తెలంగాణ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కొరకు కవిత , UNSW వైస్ ఛాన్సలర్ ప్రొఫ్. జాకబ్ తో కూడిన   బృందంతో   సమావేశమయ్యారు. ఈసమావేశం లో తెలంగాణ లోని విద్యార్థులకు స్కాలర్ షిప్స్ తో పాటు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య పూర్తి చేసే ప్రక్రియ గురించి చర్చించారు.

త్వరలోనే ఎంపీ కవిత సిడ్నీ లో UNSW  ఆధ్వర్యం లో జరిగే  సమావేశంలో  పాల్గొంటారని , ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వస్తే  తెలంగాణ విద్యార్థుల కల నెరవేరుతందని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు . UNSW బృందం  కవిత ద్వారా తెలంగాణ లోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ఆనందం వ్యక్తం చేశారని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఎంపీ కవితతో ఈ సమావేశానికి సహకరించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, కిశోర్ బేండే, రాజేష్ రాపోలుకు వైస్ ఛాన్సలర్ ప్రొఫ్. జాకబ్ తో కూడిన   బృందం కృతజ్ఞతలు తెలిపింది.