ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్…

99
ts
- Advertisement -

రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

మొత్తం 1539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 9809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. అవాంఛనీయ సంఘనటనలు జరుగకుండా భారీ బందోబస్సు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్‌, మాస్కులు,గ్లౌసులు అందుబాటులో ఉంచారు.

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 59 డివిజన్లు ఉండగా, 250 మంది బరిలో నిలిచారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు ,నకిరేకల్‌ మున్సిపాలిటీలో 20 వార్డులు, జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డులు, అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులు, కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

- Advertisement -