సాగర్‌లో టిఆర్‌ఎస్‌…. తిరుపతిలోవైసీపీ

119
sagar
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్,తమిళనాడులో డీఎంకే,అస్సాంలో బీజేపీ,బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ మధ్య హోరాహోరి పోరు జరుగగా, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలు వెల్లడించాయి.

ఇక నాగార్జున సాగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని సర్వేలు వెల్లడించాయి. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిపై టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 20 వేల ఓట్లతో గెవచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఇక్కడా బిజెపి నామకార్థంగానే మిగిలిపోయింది. టీఆర్ఎస్‌కు 51 శాతం ఓట్లు పోలవగా కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు పోలయ్యాయని వెల్లడించాయి.

ఇక తిరుపతిలో వైసీపీ తిరుగులేని మెజార్టీతో గెలుస్తుందని సర్వేలు స్పష్టం చేశాయి. మూడు నుండి నాలుగు లక్షలు ఆధిక్యతవచ్చే అవకాశముందని తెలిపాయి. వైసీపీకి 62 శాతం ఓట్లు పోలవగా టీడీపికి 22 శాతం ఓట్లు పోలయ్యాయని వెల్లడించాయి. ఇక్కడ కూడా బీజేపీ నామమాత్రంకే పరిమితం కానుంది.

- Advertisement -