రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు: ఎమ్మెల్సీ ప‌ల్లా

23
mlc palla

సీఎం కేసీఆర్‌పై ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మ‌కం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల గెలుపుతో మ‌రోసారి రుజువైంద‌ని ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఓరుగ‌ల్లు ఓట‌ర్లు గులాబీ జెండాను గుండెల‌కు హ‌త్తుకుని.. అభివృద్ధికే ప‌ట్టం క‌ట్టారు అని కొనియాడారు. కార్పొరేట‌ర్లుగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి. భారీ విజ‌యాన్ని అందించిన ఓరుగ‌ల్లు ఓట‌ర్ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేద‌న్నారు. ఎన్నిక ఏదైనా కారు జోరు కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు. సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు.