7న మేయర్,ఛైర్మన్ల ఎన్నిక

27
gwmc

రాష్ట్రంలో ఇటీవల జరిగిన 2 కార్పొరేషన్, 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ల ఎన్నిక ఈ నెల 7న జరుగనున్నది.

ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి. 5 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లను టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకొన్నది.వరంగల్‌ మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు, ఖమ్మం మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యాయి.

సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు, అచ్చంపేట జనరల్‌కు, నకిరేకల్‌ బీసీ జనరల్‌కు, జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేయగా అన్నిస్థానాల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులే కూర్చోనున్నారు.