కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు

137
తెలంగాణ ఇంటర్ బోర్డు

తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విద్యార్దులకు న్యాయం చేసేందుకు సర్కారు తగిన చర్యలు తీసుకుటుంది. త్రిసభ్య కమిటితో విచారణ జరిపించి ఫలితాల్లో జరిగిన లోపాలను ప్రభుత్వానికి అందజేశారు. తాజాగా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబరీనా సంస్ధపై ఆరోపణలు వెల్లువెత్తున్న నేపధ్యంలో జవాబుపత్రాల రీ వెరిఫికేషన్, ఫలితాల ప్రాసెసింగ్ ప్రక్రియను గ్లోబరినాతో పాటు మరో స్వతంత్ర ప్రైవేటు సంస్ధతో నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు.

గ్లోబరీనా సంస్థను ఇప్పటికిప్పుడు తప్పించడం వీలు పడదు కాబట్టి మరో సంస్ధలో రీ వెరిఫికేషన్ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్లోబరినాతో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజి సర్వీసెస్ కు అప్పగించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ. అశోక్ తెలిపారు. త్రిసభ్య కమిటీ సూచన మేరకు ఏజెస్సీని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.