ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..

80
inter
- Advertisement -

విద్యార్థులకు శుభవార్తను అందించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఇప్పటికే ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇంటర్ బోర్డు..తాజాగా రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారు తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఫెయిలైన విద్యార్థులను ప్రభుత్వ నిర్ణయం మేరకు పాస్ చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో ముఖ్య సూచన చేసింది. విద్యార్థులందరూ శుక్రవారం నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని సూచించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి మార్కుల మెమోలను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలలోని ప్రిన్సిపాళ్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.

- Advertisement -