భట్టికి స్వల్ప అస్వస్థత…

200
batti vikramarka

సీఎల్పీ నేత,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలికడగా ఉందని తెలిపారు వైద్యులు.

గత మూడు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు భట్టి. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో ఖమ్మంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. భట్టిని కాంగ్రెస్ నేతలు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.