18 వేలు దాటిన కరోనా కేసులు…

195
Etela-rajender
- Advertisement -

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. గురువారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో 1213 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. గత 24 గంటల్లో 987 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం రాష్ట్రంలో 9,226 యాక్టివ్ కేసులు ఉండగా 9,069 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం కరోనాతో 8 మంది మృతిచెందగా ఇప్పటివరకు 275 మంది మృత్యువాతపడ్డారు.

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 5,356 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,213 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 98,153కు చేరింది. గురువారం 4,143 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 998 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లాలో 10 కేసులు, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండ 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి జిల్లాల్లో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6, కరీంనగర్, మహబూబాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో 5 కేసులు, సూర్యాపేట, ములుగు, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 4, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో 2, గద్వాల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కోకేసు చొప్పున కరోనా కేసులను గుర్తించారు.

- Advertisement -