పీవీ తపాళ బిళ్ల విడుదల….కేకే హర్షం

86
pv

మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు స్మారకార్థం కేంద్రప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు పీవీ జయంతుత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ కె .కేశవ రావు. ఇందుకోసం చొరవ చూపిన సీఎం కేసీఆర్‌కు ,రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

పీవీ నర్సింహారావు శతజయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్ధం తపాళ బిళ్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పీవీ దూర దృష్టి, సంస్కరణలు, సౌత్‌ ఈస్ట్‌ ఆసియాతో భారత్‌ వ్యూహాత్మక , ఆర్ధిక సంబంధాలను బలోపేతం చేశారని అన్నారు.ఇది దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తిస్తూ గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.