రాష్ట్రంలో 24 గంటల్లో 1302 కరోనా కేసులు..

124
coronavirus

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 72 వేలు దాటాయి. 24 గంటల్లో 1,302 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,72,608కి చేరింది.

కరోనా మహమ్మారి నుండి ఇప్పటి వరకు 1,41,930 మంది కోలుకోగా 1,042 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులున్నాయి.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 266 నమోదుకాగా కరీంనగర్‌లో 102, రంగారెడ్డి 98, సిద్దిపేటలో 92 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 82.22శాతంగా ఉంది. ఇప్పటివరకు 25,19,315 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖవెల్లడించింది.