8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు…

170
venkaiah naidu

వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోద సమయంలో రాజ్యసభ లో ఆందోళనకు దిగిన 8మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సస్సెండ్ అయిన వారిలో డెరెక్ ఒబెరైన్, సంజయ్ సింగ్, రాజు సత్వ, రిపున్ బోర, డోళ సేన్, కేకే రాగేష్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరిన్ కరీంలు ఉన్నారు.

ఆదివారం రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న గుర్తు చేస్తూ విప‌క్ష ఎంపీలు సోష‌ల్ డిస్టాన్స్‌, కోవిడ్ నిబంధ‌న‌లు విస్మ‌రించారన్నారు. రాజ్య‌స‌భ‌కు నిజంగా అది బ్యాడ్ డే అన్నారు. బెంచ్‌ల‌పై డ్యాన్సులు చేయడం, పేప‌ర్లు విసిరేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, ఇదేమైనా పార్ల‌మెంట‌రీ మ‌ర్యాద‌నా అని నిల‌దీశారు.

డిప్యూటీ చైర్మ‌న్‌పై విప‌క్ష స‌భ్యులు ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానం చెల్ల‌దన్నారు వెంకయ్య. 90 సీ నిబంధ‌న ప్ర‌కారం డిప్యూటీ చైర్మ‌న్‌పై నోటీసు ఇవ్వ‌డానికి 14 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని, ప్ర‌తిప‌క్ష‌నేతతో పాటు ఇత‌ర స‌భ్యులు ఇచ్చిన నోటీసులు చెల్ల‌దు అని చైర్మ‌న్ వెంక‌య్య తెలిపారు.