దేశంలో 55 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

177
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 86,961 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 1130 మంది కరోనాతో మృతిచెందారు.

దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 54 లక్షల 87 వేలకు చేరువకాగా ప్రస్తుతం దేశంలో 10,03,299 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుండి 43,96,399 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87, 882గా ఉంది. రోజుకు 10 లక్షలకు పైగా టెస్టులు చేస్తుండగా ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 6 కోట్లు దాటాయి.

ప్రపంచదేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్ధానంలో ఉండగా రికవరీలో మొదటిస్ధానంలో ఉంది.