24 గంటల్లో 1417 కరోనా కేసులు…

100
coronavirus

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 1,417 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,58,153కు చేరాయి.

కరోనా నుండి 1,27,007 మంది కోలుకోగా 974 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్‌ కేసులు ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 264,రంగారెడ్డిలో 133,కరీంనగర్ 108,సంగారెడ్డిలో 107 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.1శాతంగా ఉందని వివరించింది. 26,639 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. ఆదివారం 34,427 నమూనాలు పరిశీలించగా, మొత్తం 21,69,339 టెస్టులు చేసినట్లు తెలిపింది.