దేశంలో 79,722కి చేరిన కరోనా మరణాలు..

160
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా కరోనా కేసుల సంఖ్య 48 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 92,071 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1136 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 48,46,428 కరోనా కేసులుండగా 9,86,598 యాక్టివ్‌ కేసులున్నాయి. 37,80,108 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆదివారం 9,78,500 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 5,72,39,428 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.