యావత్ భారతం…సైనికుల వెంటే: మోడీ

112
modi

యావ‌త్ దేశం సైనికుల వెంటే ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మోడీ…చైనాతో సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో యావత్ భారతం సైనికుల వెంటే ఉందనే సంకేతాన్ని పార్లమెంట్ వేదికగా ఇస్తామన్నారు.

చాలా భిన్న‌మైన స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని, ఒక‌వైపు కరోనా, మ‌రో వైపు విధి నిర్వ‌హ‌ణ ఉంద‌ని, కానీ ఎంపీలంతా త‌మ డ్యూటీకే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని చెప్పారు. క‌రోనా వైర‌స్‌కు వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ వ‌స్తే బాగుంటుంద‌న్నారు. మ‌న శాస్త్ర‌వేత్త‌లు కూడా వ్యాక్సిన్ త‌యారీలో స‌క్సెస్ సాధించిన‌ట్లు మోదీ తెలిపారు.

రాజ్య‌స‌భ, లోక్‌స‌భ‌లు రెండు వేరువేరు స‌మ‌యాల్లో జ‌రుగుతాయ‌ని, శ‌ని-ఆదివారాల్లోనూ స‌మావేశాలు ఉంటాయ‌ని, దీనికి ఎంపీలంద‌రూ ఆమోదం తెలిపిన‌ట్లు మోడీ చెప్పారు.