భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్వాగతించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అన్ని భారతీయ భాషల్లో తీర్పుల కాపీలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నందకు సీజేఐ సూచనను నేను స్వాగతిస్తున్నాను. హైకోర్టుల్లో కూడా ప్రాంతీయ భాషను అనుమతించాలనే మా దీర్ఘకాల డిమాండ్ కూడా త్వరలో నేరవేరుతుందని అనుకుంటున్నాము. అని దీని ద్వారా సామాన్య ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేస్తుందని అన్నారు.
గోవా మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించిన ఫెసిలిటేషన్ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ…మా లక్ష్యంలో భాగంగా ప్రతి భారతీయ భాషల్లోకి సుప్రీంకోర్టు తీర్పుల కాపీలను అనువాదించడం జరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంత న్యాయవాదికి ఎంతో ప్రేరణ కలిగిస్తుందని అన్నారు. మన పౌరులకు అర్థం చేసుకోగలిగే భాషలో తీర్పుల కాపీలను ఉంచనున్నట్టు తెలిపారు. మనం చేస్తున్న పని మన జనాభాలో 90శాతం ప్రజలకు చేరువ కావడంలేదు. అందుకే సాంకేతికతను నమ్ముతున్నా.. మీరు సాంకేతికతను స్వీకరించినప్పుడు కొంత విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోనవసరం లేదని సీజేఐ అన్నారు.
భారత ప్రధాని మోదీ సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. తీర్పులు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రావాలని ప్రస్తావించారు. అందుకు సాంకేతికతను వినియోగించాలని కూడా సూచించారు. ఇది ప్రశంసనీయమైన ఆలోచన. ఇది చాలా మందికి ముఖ్యంగా యువకులకు సహాయం చేస్తుందని అన్నారు. మెడిసిన్ మరియు ఇంజినీరింగ్ వంటి సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఇవి కూడా చదవంది…