క్రేజీ ఆప్‌డేట్…సల్లూ భాయ్‌ టీజర్‌

16
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ తను నటిస్తున్న సినిమాల గురించి ఇప్పటివరకూ తాజా అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ అయితే కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్బంగా ఒక రోజు ముందే టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో సల్మాన్‌ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌ విక్టరీ వెంకటేష్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కతుంది. అయితే ఈ సినిమాను తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఫ్యామిలీమాన్‌ జగపతి బాబు నటిస్తున్న ఈసినిమాకు దేవీశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. అన్నట్టు సల్మాన్‌ గాడ్‌ఫాదర్ సినిమాలో గెస్ట్‌ అప్పిరియేన్స్‌ నటించి తెలుగుకు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అన్నట్టు సల్మాన్‌ గత రెండేళ్లుగా వరుస ఫ్లాపు సినిమాలు విడుదల అయ్యాయి.

ఇవి కూడా చదవండి…

పఠాన్‌పై విషప్రచారం!

వీరసింహరెడ్డి…నా అదృష్టం

వైజాగ్ లో పుష్ప రాజ్

- Advertisement -