అర్థరాత్రి పీఎస్‌కి సీఎం…ఖాకీల షాక్‌!

34
stalin

ఇదేదో సినిమా స్టంట్ కాదు. అంతకు మించి…వినూత్న నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకుంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్…తాజాగా అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న స్టాలిన్… అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక్కసారిగా సీఎం రాకతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.

ఎస్సై సీటులో కూర్చున్న స్టాలిన్…పోలీస్ స్టేషన్‌ ఎప్పుడు నిర్మాణమైంది,ఎప్పుడు ప్రారంభించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, స్వీకరించిన పిటిషన్లు మరియు తీసుకున్న చర్యల గురించి పోలీసు సిబ్బందితో సంభాషించారు. తర్వాత పోలీసు సిబ్బంది బాగోగుల గురించి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు స్టాలిన్. ఇప్పుడా వీడియోలు, ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సీఎం స్టాలిన్‌ పరిపాలన ప్రారంభించిన దగ్గరి నుండి తనదైన నిర్ణయాలతో ముందుకువెళ్తున్నారు. మహిళలకు,పోలీసులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అసెంబ్లీలో తనను పొడిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు ఆయన వార్నింగ్‌ ఇవ్వడం చర్చగా మారిన సంగతి తెలిసిందే.