చివరి వరకు వారితోనే: నాగబాబు

41
naga babu

తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను విడిచిపెట్టనని చివరి వరకు వారితోనే ఉంటానని తెలిపారు మెగాబ్రదర్ నాగబాబు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నాగబాబు…రాజకీయాలపై ఆసక్తి పోయిందన్నారు.

రాజకీయాల్లో ఉంటేనే ప్రజాసేవ చేయాలి..లేకుంటే చేయకూడదని కాదని…కష్టాల్లో ఉన్నవారికి తనకు చేతనైనంత సాయం చేస్తానని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే మగాడి మైండ్ సెట్ మారాలన్నారు.

నేను బలహీనుడని నువ్వు అంటే..బలవంతుడినని చెప్పడం కోసం సమయాన్ని వృథా చేయనని…మరింత ధృడంగా మారి అసమానమైన శిఖరాగ్రాలను అధిరోహించి నువ్వు తప్పు అని నిరూపిస్తానని తెలిపారు.