పవన్ సన్నాసి… రాజకీయాలకు పనికిరారు: పోసాని ఫైర్

59
posani

జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు పోసాని కృష్ణమురళి. తన ఇంటిపై రాళ దాడి అనంతరం తొలిసారిగా స్పందించిన పోసాని…పవన్ రాజకీయాలకు పనికిరారని మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఆర్టిస్ట్‌గా ఉన్న‌ప్ప‌టి నుండి అలానే ఉన్నారని…స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్ర షూటింగ్‌లో కో డైరెక్ట‌ర్ ఏదో త‌ప్పు చేశాడ‌ని కొట్టాడు… అతని త‌ప్పు లేద‌ని తెలిసిన కూడా సారీ చెప్ప‌లేదన్నారు.

పవన్‌… ఎవ‌రినైన ఏమైన అనొచ్చు, త‌న‌ని మాత్రం ఎవ‌రు ఏమి అన‌కూడ‌దు అంటే రాజకీయాల్లో పనికిరాదన్నారు. చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు ఆయ‌న కాంగ్రెస్ వాళ్ల‌ని బ‌ట్ట‌లు ఇప్పి కొట్టండ‌ని అన్నారు. ఇప్పుడు ఆయ‌న ఫ్యాన్స్ పోసానిని బ‌ట్ట‌లు విప్పి కొడ‌తాం అంటున్నారు. నాయ‌కుడు ఎలా ఉంటాడో, వారి కార్య‌క‌ర్త‌లు అలానే ఉంటారని దుయ్యబట్టారు.

35 ఏళ్ల నుండి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా… ఎవ‌రితో గొడ‌వ‌ప‌డలేదు కానీ ఇప్పుడు పవన్‌ని ప్ర‌శ్నించా కాబ‌ట్టి అత‌ను నాకు శ‌తృవుగా మారాడన్నారు. నేను ఇలాంటి స‌న్నాసుల‌ని చాలా మందిని చూశా…న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? అంటూ పవన్‌ని తూర్పారబట్టారు.