బాండ్ల వివరాలను వెల్లడించాల్సిందే:సుప్రీం

20
- Advertisement -

రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్బీఐకి ఆదేశాలిచ్చింది సుప్రీం కోర్టు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు మ‌రింత అద‌న‌పు గ‌డువు ఇవ్వాల‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అభ్య‌ర్థ‌న‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.

మార్చి 12లోగా ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని కోర్టు ఇవాళ త‌న తీర్పులో ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సంకేతాల మేర‌కు బ్యాంకు వ‌ద్ద కావాల్సినంత స‌మాచారం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంద‌ని కోర్టు తెలిపింది. జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగింపు ఇవ్వాల‌ని పెట్టుకున్న పిటీష‌న్‌ను కొట్టివేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నిక‌ల సంఘానికి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వగా మార్చి 15వ తేదీన సాయంత్రం 5 గంట‌ల లోగా ఈసీ త‌మ వెబ్‌సైట్‌లో ఆ బాండ్ల వివ‌రాల‌ను పొందుప‌రుచాల‌ని స్పష్టం చేసింది.

Also Read:Harish:గీతన్నలకు అండగా నిలిచాం

- Advertisement -