అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం నోటీసులు

27
- Advertisement -

బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టులో బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేయగా రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ? అని గవాయి ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి..ఎంత సమయం కావాలో చెప్పండి అన్నారు. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు అని తెలిపారు. ఆలస్యం చేసేందుకే ఇలాంటి ఎత్తుగడులు అనుసరిస్తున్నారని… బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తెలిపారు.

Also Read:కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ భేటీ

- Advertisement -