మహేష్‌ డబుల్‌ ట్రీట్‌.. వీడియో‌ వైరల్..!

143
mahesh

గత కొంతకాలంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు. ఇటివల సినిమా ష్యూటింగ్‌లకు అనుమతి వచ్చాక మహేష్‌ మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మహేష్‌ ఇటీవలే ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ బాబు కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు ఇటీవల విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా, ఆ యాడ్‌ విడుదలైంది.

ఈ యాడ్‌లో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించాడు. ఓ లుక్‌లో చాలా యంగ్‌ గా కనపడుతుండగా, మరో లుక్‌లో మెలితిరిగిన మీసంతో ఉన్నాడు. మహేష్‌ను ఎన్నడూ లేని విధంగా ఇలాంటి మీసంతో కనపడుతుండడం ఆయన అభిమానులను అలరిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ కోసం మహేష్‌ ఈ యాడ్‌లో నటించాడు. డబుల్ ధమాకా ఆఫర్‌ నేపథ్యంలో ఇలా మహేష్‌ డబుల్‌ యాక్షన్‌లో కనపడి ప్రేక్షకులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు.

ఇక మహేష్‌ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ,తమిళ భాషల్లో విడుదల ఆయ్యే అవకాశం ఉంది.

BIG Message For Everyone