షాకింగ్‌ లుక్‌లో కీర్తి‌.. వీడియో వైరల్

315
Keerthy Suresh

హీరోయిన్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ మ‌హాన‌టి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు పెంగ్విన్ చిత్రంతో కొద్ది రోజుల క్రితం ప్రేక్ష‌కులను అలరించింది. ప్ర‌స్తుతం గుడ్ ల‌క్ స‌ఖి, రంగ్ దే, అన్నాతై, స‌ర్కారు వారి పాట‌ వంటి చిత్రాల‌లో న‌టిస్తుంది. తాజా ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అదిచూసిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. అందులో ఆమె టీ, కాపీ, చెన్నై సిటీ పట్ల తన ప్రేమను తెలుపుతూ ఓ ఫోటోను పెట్టింది. కానీ అది ఆమె అభిమానులకు అది పెద్దగా నచ్చలేదు.

ఆ ఫోటోలో కీర్తి సురేష్ చాలా స్లిమ్ అయిపోయింది. ఆకర్షణ తగ్గిందని అంటున్నారు ఆమె అభిమానులు. కీర్తి మొదట్లో బొద్దుగా, బబ్లీగా ఉండేది. ఆ లుక్స్ చూసే ఆమెను కుర్రకారు ఎక్కువగా అభిమానించారు. అలాంటి ముద్దుగుమ్మ డైటింగ్ చేస్తూ గుర్తుపట్టలేనంతగా సన్నబడిపోయింది. దీంతో నెటిజన్స్ ఆమె పిక్ పై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. జీరో సైజ్ ఏమైనా ట్రై చేస్తున్నావా.. అసలు కీర్తికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నితిన్ రంగ్ దే షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా వస్తోన్న సర్కారు వారి పాటలో కీర్తి హీరోయిన్‌గా చేస్తోంది.