ఓటేయాలంటే డిగ్రీ.. మరి పోటీ చేయడానికి అవసరం లేదా..?

151
mlc eletions

ఓటేయాలంటే డిగ్రీ కావాలె పోటీ చేయడానికి అవసరం లేదు.. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రాడ్యుయేట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ ఓటరు అయితే చాలు. కానీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే మాత్రం కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇది ఆశ్చర్యంగా ఉన్న ఎన్నికల నిబంధనలు మాత్రం ఇదే చెబుతున్నాయి.ఈ నిబంధనలు ఎప్పటినుండో ఉన్నప్పటికీ ఇప్పుడు పట్టాభద్రుల ఎమ్మెల్సీకి విపరీతమైన క్రేజ్ పెరగడంతో ఎన్నిక గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది.

అయితే పట్టాభద్రులు మాత్రం ఇదేం రూలని ముక్కున్న వేలేసుకుంటున్నారు. చదువుకున్న యువత ప్రజాప్రతినిధులుగా వస్తే ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటారని, ప్రజలకు సేవ చేస్తారని భావిస్తున్నారు. మరికొందరు ప్రజలుకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే చదువుతో పనేముంది అనుకుంటున్నారు. దేశంలో ఎన్నికలలో పోటీ చేయడానికి భారత రాజకీయ వ్యవస్థ కనీస విద్యా అర్హతను సూచించకపోవడం విడ్డూరంగా ఉంది.