హ్యాపీ బర్త్ డే నాన్న.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్‌..

23
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్, అజాత శత్రువు, నిర్మాతల పాలిట దేవుడు అనిపించుకున్న కృష్ణ పుట్టినరోజు నేడు (మే 31). ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా తన తండ్రికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘హ్యాపీ బర్త్ డే నాన్నా.. ఈ ప్రపంచంలో నిజంగా మీలాంటి మరో ఉన్నతమైన వ్యక్తి లేరు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు వర్ధిల్లాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ.. ’అని ట్వీట్ చేశారు మహేశ్.

- Advertisement -