- Advertisement -
కరీంనగర్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగిరిన సంగతి తెలిసిందే. మొత్తం 60 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 33 డివిజన్లలో గెలిచి సత్తాచాటింది. దీంతో మేయర్ పదవిని దక్కించుకునేందుకు మార్గం సుగుమం కాగా మేయర్‌గా సునీల్ రావు,డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపారాణి పేర్లను టీఆర్‌ఎస్ ఖరారు చేసింది.
వరుసగా నాలుగోసారి సునీల్‌రావు విజయం సాధించారు. ఇక తాజా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సైతం ఐదోసారి విజయం సాధించగా ఈ సారి సునీల్‌కు అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్.
33 టీఆర్ఎస్ కార్పొరేటర్లకు తోడు గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 40కి చేరింది. భారతీయ జనతా పార్టీ 13 డివిజన్లలో గెలవగా, ఎంఐఎం 6 డివిజన్లలో గెలుపొందింది.
- Advertisement -