అప్ డేట్స్….టుడే

264
harishrao
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముస్తాబాద్ మండలం బందన్ కల్ గ్రామం కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బందన్ కల్ గ్రామంలోని ఊర చెరువు వద్ద జలహారతి ఇచ్చారు కేటీఆర్.

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మూడో రోజు కోనసాగుతున్న భక్తుల రద్దీ . భక్తులకు ధర్మల్ స్కానింగ్ అనంతరం దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు . భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటుండగా 10 సంవత్సరాల లోపు పిల్లలు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతి అనుమతివ్వమని తెలిపారు ఆలయ ఈవో రామకృష్ణారావు.

సంగారెడ్డి లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ భవనాన్ని ప్రారంభించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.అనంతరం సంగారెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న హరీష్…జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలన్నారు. అప్పుడే అందరికి అవగాహన వస్తుంది …నూతన ప్రజాప్రతినిధులకు సమస్యల పై అవగాహన ఉండాలన్నారు.

సీఎం కేసీఆర్ చెప్పిన పంటలే వేస్తామని ప్రతిజ్ఞ చేశారు నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామ రైతులు. నియంత్రణ పంటలే వేస్తామని. మొక్కజొన్న పంట వేయమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో గ్రామ రైతులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తీర్మానం పత్రాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి రైతులు అందజేశారు.

నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో మిషన్ భగీరథ పై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు జగదీష్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎంవో స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల్. ఈ సమావేశానికి zp చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలుభాస్కర్ రావు, భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, నోముల నరసింహ మయ్యా, రవీంద్ర కుమార్,కలెక్టర్ ప్రశాంత్ పాటిల్,ఇతర అధికారులు హాజరయ్యారు.

- Advertisement -