తమిళ హీరోతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్‌ లాంఛ్‌..

276
Vijay Devarakonda
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. తెలుగు,తమిళంలో ఈ సినిమాలో రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ మొదలెట్టేశారు.

World Famous Lover Tamil Teaser

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం ఈ మూవీ తమిళ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌ను తమిళ హీరో విజయ్‌ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోను తన మార్కెట్ పెరుగుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్‌తో ఫైటర్‌ చిత్రంలో నటించనున్నాడు. ఇటీవలే ముంబాయిలో సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

- Advertisement -