ఆయనతో ఉంటే సేఫ్‌: రేణు దేశాయ్

192
renu desai

నిర్మాత రాజ్ కందుకూరిపై ప్రశంసలు గుప్పించారు పవన్ మాజీ భార్య,సినీ నటి రేణు దేశాయ్‌. రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా చూసి చూడంగానే సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రేణు… ఏ ఫీమేల్ టెక్నీషియన్‌ అయినా రాజ్ కందుకూరితో కలిసి పనిచేస్తే ఆమె చాలా సేఫ్‌గా ఉంటారని గర్వంగా చెప్పగలనని చెప్పారు. ఈ సినిమాలోని ఓ పాటను నా చేత విడుదల చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన అనంత్ శ్రీరామ్, చిన్మయి ఈ పాటకు కలిసి పనిచేశారని చెప్పారు.

రాజ్‌కుమార్‌ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం అని ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పగలనని తెలిపారు.