మంత్రి కేటీఆర్‌ని కలిసిన శ్రీకాకుళం వాసి..

99
ktr
- Advertisement -

లక్ష్యం మన కళ్లముందు కదలాడితే దూరం మనకు కనిపించదు. ఈ రోజు మనం రెండు కిలోమీటర్లు నడ వాలంటే ఆప సోపాలు పడిపోతాం కానీ ఒక వ్యక్తిని కలవాలని లక్ష్యంగా చేసుకున్న ఆ వ్యక్తి వెయ్యి కిలోమీట ర్లు అవలీలగా కాలినడకన నడిచా డు. నడవడమే కాదు తాను అనుకు న్న లక్ష్యాన్ని కూడా సాధించాడు. అతనెవరో తెలుసుకోవాలని ఉంటే మనం శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళ వలసిందే.

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సారధి. ఈరోజు ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. కాదు నిలిపాడు ఓ యువకుడు. అతడే వండాన శేఖర్ కు వివాహం అయింది.ఇద్దరు పిల్లలు కూడా కలరు. అయితే ఇతనికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రి తారక రామారావు (కేటీఆర్) అంటే చాలా ఇష్టం.ఆప్రభుత్వం లోఅమలు జరు గుతున్న సంక్షేమ కార్యక్రమా లుపై మక్కువ పెంచుకున్నారు. ఆ ప్రభుత్వంలోజరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా వెళ్లిమంత్రిని
కలిసి అభినిందించాలను కున్నాడు.

తను అనుకున్నది సాధించేందుకు ఎంచుకున్న మార్గం అందర్నీఆర్చర్య పరిచింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండం తన స్వగ్రామం మైన సారథి నుండి కాలి నడకన పాదయాత్రగా వెళ్లి మంత్రి కేటి అర్ ని కలిశారు. అందుకు ఆయన 20 రోజులు రోజుకు 45, నుండి 50 కిలోమీటర్లు చొప్పున నడిచి వెళ్ళాడు. చేతిలో ఓ చిన్న ప్లెక్సీ శ్రీకాకుళం నుండి హైదరాబాద్ అంటూ రాసి దానిపై సంక్షేమ పదకా లతో దూసుకుపోతున్న కేసీఆర్ అని రాసి దానిని పట్టుకుని గమ్యానికి చేరాడు.అయితే తెలంగాణా రాష్ట్రం లో పలు జిల్లాల్లో ఎమ్మెల్యే లు, పార్టీ కార్యకర్తలు తనను అభినందించారని చెప్పాడు.

నా కోరికలు ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాగా సహకరించారని తెలిపాడు. తన పాద యాత్రను చూసి అభినందించి తన కారుపై 40 కిలో మీటర్లు తీసుకువెళ్ళి కేటి అర్ కు కలిపించారని చెప్పాడు. తనను చూసి కెటిఆర్ ఎంతగానో అభినం దించారని పేర్కొన్నాడు. అయితే అప్పటికే మంత్రి వేరే కార్యక్రమం లో ఉన్నందున మరుచటి రోజు ప్రగతి భవన్ కు రమ్మన్నారని చెప్పారు.

అయితే ప్రగతి భవన్ కు వెళ్లి కలిసేం దుకు ఉన్న తనకు మంత్రిగారి పి ఏ నుండి సమాచారం వచ్చిందని మంత్రిగారు స్టేట్స్ వెళుతున్నారు. సోమవారం లేదా మంగళవారం గానీ వచ్చి కలమన్నారని చెప్పారని తాను తిరిగి వచ్చేసానని శేఖర్ చెప్పాడు. అయితే తిరిగి ఆ రెండు రోజుల్లో వెళ్లి మంత్రికి స్వయంగా కలుస్తానని అన్నాడు.మంత్రికి ఎందుకు కలుస్తున్నాడో మాత్రం చెప్పేందుకు నిరాకరించాడు. మంత్రిని కలిసి తిరిగి వచ్చిన తరువాత అన్ని విషయాలు తెలియ జేస్తానని పేర్కొన్నాడు.

- Advertisement -