క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

35

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని నిస్సి చ‌ర్చ్ లో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు మానవజాతికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్క‌డా లేని విధంగా అన్ని మ‌తాల‌కు సంబంధించిన పండ‌గుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ద‌ని తెలిపారు. క్రిస్మ‌స్ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించడంతో పాటు పేద క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం త‌ర‌పున నూత‌న‌ వస్త్రాలను పంపిణీ చేస్తున్నామ‌న్నారు.