HCU ఘటనపై రాజ్యసభలో సురేష్ రెడ్డి

25
- Advertisement -

జీరో అవర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై మాట్లాడారు బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది అన్నారు.

400 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుంది.. వందల రకాల జంతు జాతులు,వృక్ష జాతులు ఉన్నాయి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వారికి మా పార్టీ మద్దతు ఇచ్చింది అన్నారు.

విద్యార్థులు వాళ్ళ స్వంత అవసరాల కోసం ఆందోళన చేయడం లేదు.. భూములు వేలం వేయడం తో హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్ లభించదు అన్నారు. ఈ యూనివర్సిటీ లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అన్నారు.

Also Read:స్పీకర్ చర్య తీసుకోకపోతే..చూస్తూ ఉండాలా?

- Advertisement -