స్పీకర్ చర్య తీసుకోకపోతే..చూస్తూ ఉండాలా?

20
- Advertisement -

స్పీకర్ చర్య తీసుకోకపోతే.. 4 సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టు చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా ? అని ప్రశ్నించారు జస్టిస్ బి ఆర్ గవాయ్.సుప్రీంకోర్టు లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరుగగా జస్టిస్ బి ఆర్ గవాయ్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం వాదనలు వింది.

స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు వినిపించారు రోహిత్గి. ఈ సందర్భంగా స్పీకర్ కి సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ణప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ప్రశ్నించారు జస్టిస్ బి ఆర్ గవాయ్.

సుప్రీంకోర్టు కోర్టు లేదా హైకోర్టు స్పీకర్‌ను త్వరగా నిర్ణయం తీసుకోవద్దని అభ్యర్థించడానికి అర్హత లేదు అనడానికి ఉన్న తీర్పులు ఏమిటో చెప్పాలన్నారు. గతంలో స్పీకర్‌ను కోర్టు ధిక్కారానికి కోర్టుకు పిలిచారని రోహద్గీ మర్చిపోకూడదు..కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి అని తేల్చిచెప్పారు.

స్పీకర్ చర్య తీసుకోకపోతే.. 4 సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టు చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా ?, పార్టీ ఫిరాయింపుల నోటీసు జారీ చేయడానికి స్పీకర్ 11 నెలలు సమయం తీసుకున్నారు.. అది కూడా సుప్రింకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చారు అన్నారు. గత విచారణలో బీఆర్ఎస్ వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.

Also Read:పాక్ కవ్వింపు చర్య..తిప్పికొట్టిన భారత్

- Advertisement -