పాక్ కవ్వింపు చర్య..తిప్పికొట్టిన భారత్

19
- Advertisement -

పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టింది భారత్. క‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద పాకిస్థాన్ ఆర్మీ హ‌ద్దులు దాటగా కాల్పులు జ‌రిపిన పాక్ ఆర్మీ చ‌ర్య‌ల‌ను భార‌త్ తిప్పికొట్టింది. ఏప్రిల్ ఒక‌టో తేదీన కృష్ణ ఘాటీ సెక్టార్ వ‌ద్ద పాక్ ఆర్మీ నియంత్ర‌ణ రేఖ దాట‌డం వ‌ల్ల మైన్ బ్లాస్ట్ అయిన‌ట్లు భార‌తీయ సైనిక బ‌ల‌గాలు వెల్ల‌డించాయి.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఫైరింగ్ జ‌రిగింద‌ని, పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

2021 మీటింగ్‌లో ఇరు వైపుల డీజీ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్‌.. శాంతి స్థాపన కోసం ప‌లు అంశాల‌ను అంగీక‌రించార‌ని, నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద కాల్పుల విర‌మ‌ణ‌కు కూడా ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ఆర్మీ గుర్తు చేసింది.

Also Read:HCU భూముల వేలంపై ఎమ్మెల్సీ కవిత

- Advertisement -