రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రం మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ మరియు కోమోరిన్ లోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మరియు దక్షిణ బంగాళాఖాతం లోని మరి కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండము ఉత్తర దిశగా ప్రయాణించి ఈరోజు (జూన్ 2 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో Lat.15.3 deg N మరియు Long. 71.2 deg.E వద్ద పాంజిమ్(గోవా) కు పశ్చిమ దిశగా 280 km,ముంబై(మహారాష్ట్ర ) కు దక్షిణ నైఋతి దిశగా 450 km,సూరత్(గుజరాత్) కు దక్షిణ నైఋతి దిశగా 670 km దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.
ఇది రాగల 6 గంటలలో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో కొన్ని గంటలు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తరఈశాన్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ గుజరాత్ తీరాలలో హరిహారేశ్వర్ మరియు దామన్ ల మధ్య అలీబాగ్(రాయ్‌గడ్ జిల్లా, మహారాష్ట్ర) కి దగ్గరలో జూన్ 3 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100-110 km నుండి 120 km వేగంతో గాలులు వీచే అవకాశంఉంది.
ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.