అవయవదానం..అగ్రస్థానంలో తెలంగాణ నిలిపాం: హరీష్ రావు

12
- Advertisement -

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరం, వీరికి అభినందనలు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అవయవదానం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్‌.. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు అన్నారు.

ఈరోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం…ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది అన్నారు. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవాదనం చేసుకునే అవకాశం కలుగుతుంది… అంతేగాకుండా అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్ధారించే వారు అన్నారు.

ఈ బిల్లు ద్వార డాక్టర్లు అందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు… దీంతో త్వరగా నిర్దారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది అన్నారు. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది.. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే… బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపాం అన్నారు. దేశంలో అత్యధిక అవయవదానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం.. తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది.ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వచ్చేది అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగాయి.. అవయవమార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవమార్పిడిలు చేశాం అన్నారు. 20 లక్షల ఖర్చయ్యేవి నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో చేశాం… సంవత్సరం పాటు మందులు కూడా ఇవ్వడం జరిగింది.. కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది…అవయవదానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అన్నారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు ఇవ్వాలి… ఆ కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలి. ఇలాంటి ప్రత్యేకతలు వారికి కల్పిస్తే అవయవదానం మరింత ప్రోత్సహించినట్లు అవుతుంది అన్నారు.

Also Read:ఢిల్లీలో కుస్తీ…గల్లీలో దోస్తీ: వివేకా

- Advertisement -