దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా కరోనా పాజిటివ్..!

97
president

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర రూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ దాటికి దక్షిణాఫ్రికా అట్టుడికిపోతుండగా తాజాగా ఆదేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

రామఫోసో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. అయితే ఆదివారం ఆయన స్వల్ప అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు.

రామపోసో ఇటీవలే నైజీరియా వెళ్లివచ్చారని, డిసెంబర్‌ 8న సెనెగల్‌ నుంచి వచ్చిన తర్వాత పరీక్షలు చేయగా ఆయనకు నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు.