బిగ్ బాస్ 5…కాజల్ ఎలిమినేట్

57
kajal

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 14 వారాలు పూర్తి చేసుకుంది. 14వ వారంలో భాగంగా ఇంటి నుండి కాజల్ ఎలిమినేట్ కాగా టాప్ 5లో నిలిచారు సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్‌, శ్రీరామచంద్ర. ఇక ఇంటి నుండి కాజల్ వెళ్లి పోవడంతో ఎమోషనల్ అయ్యారు మానస్ , సన్నీ. వారిని ఓదార్చి బయటికొచ్చిన కాజల్… సన్నీని మోస్ట్ ఎంటర్టైనర్‌గా చెప్పింది. ఇక మానస్‌కు ఫ్రెండ్ షిప్ అనే ట్యాగ్ ఇచ్చింది.శ్రీరామచంద్రకు యాక్షన్ అనే ట్యాగ్ ఇవ్వగా ఇక సిరి అయితే ఏదీ దాచుకోలేదు అని, తన ఎమోషన్స్ అన్నీ కూడా బయటపెట్టేస్తుందని తెలిపాడు. షన్ను సిరిని బాగా కంట్రోల్ చేస్తారని తెలిపారు.

ఇక తొలుత సండే ఫండే ఎపిసోడ్ ఆధ్యంతం ఎంటర్‌టైన్‌గా సాగింది. చిట్టీలో వచ్చిన పాటను.. పాడకుండా, స్టెప్పులు వేయకుండా యాక్ట్ చేసి మాత్రమే చూపించాలి. అవతలి వాళ్లు గెస్ చేయాలని తెలిపాడు. ఇందులో కోసం శ్రీరామచంద్ర, కాజల్, షన్ను ఒక టీం. మిగిలిన మానస్, సిరి, సన్నీలను మరో టీంగా విడగొట్టారు. ఇందులో శ్రీరామచంద్ర టీం విన్ అయింది. ఆ తరువాత సిరి థర్డ్ ఫైనలిస్ట్‌ అయిందంటూ సన్నీ చేత ప్రకటించాడు నాగ్.

తర్వాత ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లను కొన్ని ప్రశ్నలు వేశారు. అలా సిరి, షన్నులని జెస్సీ కొన్ని ప్రశ్నలు వేశాడు. మానస్ కోసం ప్రియాంక ఓ ప్రశ్నను వేసింది. కాజల్ కోసం ప్రియ, శ్రీరామచంద్ర కోసం నటరాజ్ మాస్టర్ ప్రశ్నలు వేశారు. తర్వాత షన్ను మరో ఫైనలిస్ట్ అని నాగార్జున ప్రకటించాడు. చివరగా మానస్,కాజల్ మిగలగా కాజల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్.