రష్మికా నా మనసుకు నచ్చిన అమ్మాయి: బన్నీ

29
allu arjun

రష్మిక అంటే నేషనల్ క్రష్… నా మనసుకు నచ్చిన అమ్మాయి… ఆమె ఎక్కడో ఉండాల్సిన నటి అని కొనియాడారు అల్లు అర్జున్. వీరిద్దరు నటించిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ..అందరికీ ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది. అభిమానులు నా ఆర్మీ. నేను నా జీవితంలో సంపాదించుకుంది ఏదైనా ఉంటే మీరేనని చెప్పారు.

పుష్ప, పుష్ప రాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే… ఏందబ్బా ఎట్లా ఉండరు… శానా దినలైనాది మిమ్మల్ని కలిసి… ఎంది రచ్చ… ఆపొద్దు తగ్గేదే లే… నేను సరదాగా అంటూ ఉంటాను అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్న అంటే అది మీరు మీ ప్రేమ.. నాకు అంతకంటే ఎక్కువ ఏమీ ఇంపార్టెంట్ కాదు… మా గెస్ట్ లుగా వచ్చిన రాజమౌళి, మారుతి, బుచ్చిబాబు మిగతా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

దేవిశ్రీ ప్రసాద్ నాకు అద్భుతమైన ఆల్బం ఇచ్చాడు. థాంక్యూ… సామీ సామీ సాంగ్ నాకు పర్సనల్ గా నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌తో ఎప్పటినుంచో జర్నీ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఈ ఫంక్షన్‌కు సుకుమార్‌ రాకపోవడంతో నాకేమీ అర్థం కాలేదు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడితే నన్ను కన్విన్స్‌ చేశారు…నిజంగా ఆయన పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్‌ అని అల్లు అర్జున్‌ తెలిపారు.