చిన్న తరహా పరిశ్రమలకు పూచీకత్తులేని రుణాలు..

188
somesh kumar
- Advertisement -

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమలకు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ క్రింద పూచీకత్తు లేని రుణాలు అంధించడానికి కలెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమ లకు ఆత్మ నిర్బర్ అభియాన్ ప్యాకేజి పై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఎక్కవ మందికి లబ్దీ చేకూర్చే విధంగా జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల లోని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లతో తరచు సమీక్షలు నిర్వహించాలని అన్నారు. రుణాలు అంధించేందుకు రాష్ట్రాలకు ఎలాంటి పరిమితి లేనందున వీలైనంత సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం పై కలెక్టర్లు దృష్ఠి సారించాలని ఆయన పేర్కొన్నారు.

Credit Guarantee Scheme for Subordinate debt క్రింద అర్హత ఉన్న సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల జాబితను అందించాలని బ్యాంకర్లను కోరారు. బ్యాంకర్లు తమకు కేటాంయించిన లక్ష్యాల మేరకు రుణాలు అంధించాలని కోరారు.

ఈ సమావేశంలో  పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ , కమీషనర్ శ్రీ మణిక్ రాజ్ , సంచాలకులు డా.ఎన్. సత్యనారయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.         
- Advertisement -