నామినేషన్ దాఖలు చేసిన సోలిపేట సుజాత…

186
sujatha

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు.

అంతకముందు చౌదరి పల్లి దర్గాలో , ధర్మాజీ పేట లో చర్చ్ లో, రెగుల కుంట దేవాలయం లో ప్రత్యేక పూజలు చేశారు సుజాత. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబరు 3న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. బీజేపీ నుండి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుండి చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు.