శోభా నాయుడు మృతి…సీఎం కేసీఆర్ సంతాపం

194
cm k cr

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభా నాయుడు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.కూచిపూడి క‌ళానృత్యంలో శోభానాయుడు అసాధార‌ణ క‌ళాకారిణి అని, స‌త్య‌భామ‌, ప‌ద్మావ‌తి లాంటి పాత్ర‌ల‌ను త‌న డ్యాన్స్ రూపంలో ఆమె అల‌రించిన‌ట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా డా.శోభానాయుడు శిక్షణ ఇచ్చిన శిష్యులు(రాలు) వేలసంఖ్యలో ఉన్నారు. కూచిపూడి అకాడమీని స్థాపించి గత 40ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు.