స్కైలాబ్‌ మూవీ రివ్యూ..

618
- Advertisement -

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం ‘స్కైలాబ్‌’.నిత్యామీనన్ హీరోయిన్‌. రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్‌’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ:

1979లో కరీంనగర్ జిల్లాలోని బండ్ల లింగం పల్లి అనే ప్రాంతంలో నడిచే కథ ఇది. ఆ సమయంలో నాసా ప్రయోగించిన భారీ ఉపగ్రహం స్కైలాబ్ విఫలమై దాని శకలాలు పలు దేశాలపై పడబోతున్నట్లుగా వార్తలొస్తాయి. దీంతో బండ్లలింగం పల్లి జనాలు సైతం ఈ స్కైలాబ్ భయంతో వణికిపోతారు. దాన్నుంచి ఎలా బయటపడాలా అని మార్గాలు వెతుకుతారు. ఇక తమకు రేపు అనేది ఉండదని అర్థమైన స్థితిలో వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వచ్చింది. ఈ ఉపద్రవం నుంచి బయటపడే క్రమంలో వాళ్లు నేర్చుకున్న పాఠాలేంటి అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్‌:

జర్నలిస్ట్‌ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. ఆమె వాయిస్‌ కూడా సినిమాకు ప్లస్‌ అయింది. ఇక సత్యదేశ్‌, రాహుల్‌ రామకృష్ణ నటనకు చెప్పాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. వారి పాత్రల్లో ఒదిగిపోయారు. క్లైమాక్స్‌ సీన్స్‌, సంభాషణలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్‌:

తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. వినోదం పండించడానికి మంచి అవకాశమున్న కాన్సెప్టే అయినా.. ఆర్ట్ సినిమా తరహలో నత్తనడకన సాగే కథనం నీరసమే తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం:

ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. రీ రికార్టింగ్‌ కూడా ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ సినిమాకు ప్లస్‌ అయ్యింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్‌ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది.

తీర్సు:

‘స్కైలాబ్‌’ ప్రయోగం దారి తప్పింది..!

విడుదల తేది: 12/4/2021
రేటింగ్‌: 2/5
నటీనటులు: సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి
నిర్మాతలు: పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్‌
దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు

- Advertisement -