- Advertisement -
వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ హీరో సూర్య. తన నటనతో ప్రేక్షకులను మెప్పించే సూర్య…తాజాగా వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాగా తాజాగా జీవి ప్రకాష్…వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఇందుకోసం దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారట.
సూర్య సరసన గా భాగ్యశ్రీ భోర్సే నటించనున్నట్లు వార్తలు రాగా తాజాగా మరో బ్యూటీ.. కాయదు లోహర్ ను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించనున్నారు మేకర్స్.
Also Read:గ్రేటర్‌లో 3 రోజులు వైన్స్ బంద్
- Advertisement -

