బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనాయకుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ తప్పుడు రీతిలో పోస్ట్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్లోలో పాటు వాటిని షేర్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు రజతోత్సవ సభకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వాల్ రైటింగ్, పోస్టర్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గోడలపై రాసిన చలో వరంగల్ నినాదాల స్థానంలో అభ్యంతకరమైన రీతిలో మార్చింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ నేతలు షేర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులపై ఇలాంటి పోస్టింగ్లు పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్ ‘తెలంగాణగ ళం’తో పాటు ఇతర వ్యక్తులు, అకౌంట్స్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు బీఆర్ఎస్ నాయకులు.
Also Read:గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ సమావేశం..

