మహేశ్‌ బాబుకు షాకిచ్చిన ఈడీ..

30
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్‌ బాబుకు షాకిచ్చింది ఈడీ. మహేశ్ సాయిసూర్య డెవలపర్స్‌, సురానా ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా కొద్దిరోజులుగా ఈ రెండు కంపెనీలకు చెందిన వారిపై ఈడీ రైడ్స్ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహేశ్‌ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 28న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ రెండు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మహేశ్ బాబు ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారన్న అభియోగంపై ఆయనకు నోటీసులు అందాయి.

Also Read:పీసీసీ చీఫ్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్

సాయిసూర్య డెవలపర్స్‌ కు చెందిన కంచర్ల సతీశ్‌ చంద్ర గుప్తా పై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటుడితో ప్రచారం చేయించారని, దీంతో తాము నమ్మామని అన్నారు. 2021లో షాద్‌నగర్‌లోని 14 ఎకరాల స్థలంలో వెంచర్‌ కోసం రూ.3 కోట్లు కట్టామని చెప్పారు.

- Advertisement -